Monday, May 12, 2008

ఇందులేడు అందుకలడని సందేహము వలదు - ఎందెందు వెతికినా అందందే కలడు.

ఈ డైలాగ్ చూసి చూడగానే మన అందరికి భక్త ప్రహ్లాద సినిమా గుర్తుకొస్తుంది. అంత పాపులర్ డైలాగ్ అది. అందులో శ్రీమహావిష్ణువు ఉగ్రనరసింహ రూపుడై హిరణ్యకశపుడు చూపిన స్థంభంను చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ తరువాత హిరణ్యకశపున్నిఎలా సంహరించింది మనందరికీ కళ్ళ ముందు సీన్ బై సీన్ రీల్ తిరిగినట్టు గుర్తే. ఇక అసలు విషయానికి వస్తే, అంత పాపులర్ డైలాగ్ని ఏదో ఒక సీన్ తో టై చేసి గుర్తుపెట్టుకోవడం ఆ డైలాగ్ కి అన్యాయం చేసినట్టే.

"ఇందులేడు అందుకలడని సందేహము వలదు - ఎందెందు వెతికినా అందందే కలడు". దైవత్వం నిండిన ఈ నేచుర్ ని అబ్యూస్ చేస్తూ మనం దేవున్ని వెతుక్కుంటు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తున్నాము. ఇంటి చుట్టూ వున్న చెట్ట్లని నరికి ఏ సీ కొనుక్కుంటున్నాము. గ్రీన్ జోన్లని వెతికి పట్టుకుని మరీ డంప్ యార్డులుగా మార్చుతున్నాము. పారిశ్రామికాభివ్రుద్ది పేరుతో పంట పొలాలని లాక్కొని ప్రత్యేక ఆర్థిక మండల్లను పెట్టుకుంటున్నాము. మన ఇంట్లో అలంకరణకోసం జాతీయ జంతువు పులిని కూడా హాంఫట్ చేస్తున్నాం. వీటన్నిటికి మేముకాదు ప్రభుత్వముదీ బాద్యత అని మీరనొచ్చు. దానికి నేను "ప్రజలే ప్రభుత్వం" అని డైలాగ్ కొట్టను. ఒక ఎదురు ప్రశ్న వేస్తా - ఈ నేచుర్ ని కాపాడడానికి మనమేమిచేసాము? ప్రకృతిని కాపాడుకోండని దేవుడు చేసిన మందలింపే ఈ సునామి, కట్రినా, నర్గీస్ లేదా ఇంకేమైన ఉపద్రవాలు అని నా అభిప్రాయం.ఇదేమైనా న్యాయమా? అని దేవుడు మనల్ని అడగకముందే మనం బాద్యత కల మనుషులుగా, ఈ భూమిపైన తెలివైన కరుణగల జీవులుగా ప్రవర్తించుదాం. మనకీ, రేపటి తరాలకీ సుఖప్రదమైన లోకాన్ని అందిద్దాం.

No comments: